విశాఖ జిల్లా మన్యంలో చలి తీవ్రత పెరిగిపోయింది. కొంత కాలంగా చలి గాలులు విజృంభించడంతో ఏజెన్సీ ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అది చాలదన్నట్లు మన్యం ప్రాంతమంతా పొగమంచుతో నిండిపోయి.. ఏమీ కనిపించట్లేదు. దట్టమైన పొగమంచుతో వాహన చోదకుల ఇబ్బందులు పడుతున్నారు. మినుములూరులో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
MANYAM TEMPARATURE: మన్యంలో పెరిగిన చలి తీవ్రత.. వణుకుతున్న ప్రజలు - VISAKA
విశాఖ మన్యంలోని ప్రజలను చలి చంపేస్తోంది. ఓ వైపు పొగమంచు.. మరో వైపు ఎముకలు కొరికే చలి.. మంటలు వేసుకున్నా, ఉన్ని దుస్తులు కప్పుకున్నా చలికి చలికి గజగజా వణికిపోతున్నారు.
మన్యంలో పెరిగిన చలి తీవ్రత.. వణుకుతున్న ప్రజలు