రాష్ట్రంలో వైకాపా ఆకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సీపట్నంలో విస్తృతంగా ప్రచారం చేశారు. 10, 11, 12, 13 వార్డుల్లో.. కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
'వైకాపా పాలనకు త్వరలోనే చరమగీతం' - ఈరోజు విశాఖ జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు పాదయాత్ర వార్తలు
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు.. నర్సీపట్నంలో పాదయాత్ర నిర్వహించారు.
నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు పాదయాత్ర
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ విషయాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలను బెదిరించి, దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ఏకగ్రీవాల పేరుతో పదవులను పొందుతున్నారని, ఈ పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...