విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను విదేశాలకు అప్పగించేలా మొగ్గు చూపడం దారుణమని తెలుగు యువత ఉపాధ్యక్షుడు మొల్లిపెంటి రాజు అన్నారు. విశాఖపట్నంలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్టీల్ ప్లాంట్ స్థాపనకు అవసరమైన భూములిచ్చిన నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి... ఇప్పటికీ హామీలు నెరవేర్చకుండా, పోస్కో అంటూ కొత్త కంపెనీకి మిగిలిన భూములను కట్టబెట్టేందుకు యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్.కార్డులు ఉన్న నిరుద్యోగులకు తక్షణమే స్పెషల్ రిక్రూట్మెంట్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.