ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భగవద్గీతపై ఆసక్తి.. 10 నెలల కోర్సు 7 నెలల్లోనే పూర్తి

విశాఖ జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడి కుమారుడు.. సంస్కృతంలో సత్తా చాటాడు. భగవద్గీతపై బెంగళూరు గణపతి సచ్చిదానంద ఆశ్రమం నిర్వహిస్తున్న 10 నెలల భగవద్గీత ఆన్ లైన్ కోర్సును.. 7 నెలల్లో పూర్తి చేసి ప్రశంసలు అందుకున్నాడు.

భగవద్గీత శ్లోకాలను ఆలపిస్తున్న చిన్నారి
భగవద్గీత శ్లోకాలను ఆలపిస్తున్న చిన్నారి

By

Published : Jan 9, 2021, 11:58 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సత్యనారాయణపురానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం.. తన మనవళ్లకు సంస్కృతంపై ఆసక్తి కలిగించారు. సుబ్రమణ్యం కుమారుడి కుటుంబం ఉద్యోగరీత్యా యూఏఈలో స్థిరపడినా.. సుబ్రహ్మణ్యం సూచన మేరకు అక్కడే సంస్కృతంతో పాటు.. భగవద్గీత శ్లోకాలు నేర్పించారు. 11వ తరగతి చదువుతున్న శశాంక్, రెండో తరగతి చదువుతున్న శ్రీహిత్ రాజ్.. సంస్కృతంలో మంచి పట్టు సాధించారు.

బెంగళూరు గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం ఆన్​లైన్​లో నిర్వహిస్తున్న భగవద్గీత 10 నెలల కోర్సులో.. శశాంక్ చేరాడు. 7 నెలల కాలంలోనే కోర్సు పూర్తి చేశాడు. అతను ఇప్పటికే.. దుబాయ్ లో భగవద్గీత శ్లోకాలు సాధన చేస్తున్న వారికి ముఖ్య సలహాదారుగా సేవలందిస్తున్నాడు. అతని తమ్ముడు శ్రీ హిత్ రాజ్ సైతం.. ఇంటి నుంచే అన్న, తల్లి సహకారంతో భగవద్గీత శ్లోకాలు సాధన చేస్తున్నాడు. సత్యనారాయణపురం మండల పరిషత్ పాఠశాలలో ప్రతిభను ప్రదర్శించిన శశాంక్.. ప్రశంసలు అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details