ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్న సన్నిధిలో... తెలుగు పంచాంగ కర్తల సమావేశం - సింహాచలంలో పంచాంగ కర్తల సమావేశం

విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో... తెలుగు పంచాంగ కర్తల సమావేశం జరిగింది. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ముఖ్యఅథిగా హజరయ్యారు. జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సింహాచలంలో పంచాంగ కర్తల సమావేశం

By

Published : Nov 2, 2019, 8:56 PM IST

తెలుగు పంచాంగ కర్తల సమావేశం

విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో తెలుగు రాష్ట్రాల పంచాంగ కర్తల సమావేశం జరిగింది. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో పంచాంగం ఒకేలా ఉండాలని... ఈ సమావేశ ముఖ్య ఉద్ధేశం ఇదేనని స్పష్టం చేశారు. దేశమంతటా... తెలుగు రాష్ట్రాల్లో రచించిన పంచాంగం అనుసరిస్తున్నారని వివరించారు. ముందు జరిగే ఉపద్రవాలు, ముహూర్తాలను తెలుగువారు చెబుతున్నారంటే... అది మన గొప్పతనమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల పండితులు సిద్ధహస్తులని... ప్రపంచం గుర్తించడం గర్వకారణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాంగ కర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details