రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో జీవీఎంసీ మేయర్ పీఠాన్ని తెదేపా కైవసం చేసుకుంటుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విశాఖలో జోస్యం చెప్పారు. నగరాన్ని అభివృద్ధి చేయడంలో తెదేపా ఎనలేని కృషి చేసిందని స్పష్టం చేశారు.
ఆ కృషికి ఫలితాన్ని ప్రజలు కార్పొరేషన్ ఎన్నికల ద్వారా అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేనప్పటికీ.. అమరావతికి అన్యాయం చేస్తే మాత్రం పోరాటం తప్పదని హెచ్చరించారు.