ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రి కూతురు కోసం రిజర్వేషన్లను మార్చేశారు' - జీవీఎంసీ ఎన్నికల రిజర్వేషన్ల గురించి ఎస్​ఈసీకి ఫిర్యాదు చేసిన తెలుగు శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

జీవీఎంసీ ఎన్నికలకు రిజర్వేషన్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలను ఎస్​ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుగు శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్ తెలిపారు. తన కుమార్తె కోసం ఎస్టీ వార్డును మంత్రి అవంతి శ్రీనివాస్ జనరల్ చేశారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో నామినేషన్ వేయలేకపోయిన వారికి ఒక్కరోజు అవకాశం కల్పించాలని ఫిర్యాదులో కోరినట్లు చెప్పారు.

telugu sakthi sangham state president bv ram complaint to sec
జీవీఎంసీ రిజర్వేషన్లపై ఎస్​ఈసీకి తెలుగు శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు

By

Published : Feb 16, 2021, 5:55 PM IST

విశాఖ మహా నగర పాలక సంస్థ ఎన్నికలకు రిజర్వేషన్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని.. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగు శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను పోటీ చేయించేందుకు మంత్రి అవంతి శ్రీనివాస్.. ఎస్టీ వార్డును జనరల్ చేశారని తెలిపారు. ఇదే తరహాలో పలు అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్లే విశాఖలో జరుగుతోందని బీవీ రామ్ ఆరోపించారు. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ చాలా మంది నామినేషన్లు వేయలేకపోయారని.. ఇప్పుడైనా వేసేందుకు ఒక్కరోజు సమయం ఇవ్వాలని కోరారు. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడి, స్వేచ్ఛగా ఎన్నికలు జరిపినట్లని తెలిపారు. జరిగిన పరిణామాలపై ఎస్ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు మీడియాకు ఆయన వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details