ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు అకాడమీలో సంస్కృత అకాడమీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ నిరసన.. - Telugu army activists protest in Visakhapatnam

విశాఖ మద్దిలపాలెం కూడలి తెలుగుతల్లి విగ్రహం వద్ద తెలుగు దండు కార్యకర్తల ఆందోళన చేపట్టారు. తెలుగు అకాడమీలో సంస్కృత అకాడమీని విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలిపారు. ప్రభుత్వం అకాడమీల విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Telugu Dandu activists protest
తెలుగు దండు కార్యకర్తల ఆందోళన

By

Published : Jul 12, 2021, 2:19 PM IST

తెలుగు అకాడమీలో... సంస్కృత అకాడమీని విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు దండు కార్యకర్తలు విశాఖ మద్దిలపాలెం కూడలి తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. తెలుగు అకాడమీ పేరును మార్చడంపై నిరసన చేపట్టారు. ఈ రెండు అకాడమీలు కలిపి ఏర్పాటు చేయడం వల్ల ప్రణాళికలు.. నిధుల సాధన ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అకాడమీల విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details