ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 29, 2020, 3:22 PM IST

ETV Bharat / state

'భాషా సంస్కృతిని కాపాడలేని ప్రభుత్వాలకు పాలించే హక్కులేదు'

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో 'మాతృభాషకు వందనం' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు.

telugu basha dinostavam in vizag
విశాఖలో తెలుగు భాషా దినోత్సవం

వైకాపా ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు ఆంగ్ల మాధ్యమం కొనసాగించాలనే ప్రయత్నాలు చేస్తోందని.. ఇది చాలా విచారకరమని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విశాఖ మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద 'మాతృభాషకు వందనం' అనే కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మతృభాషలో బోధించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మాధవ్ స్పష్టం చేశారు.

తెలుగు దండు వ్యవస్థాపకుడు పరవస్తు ఫణిశయన సూరి మాట్లాడుతూ.. భాషా సంస్కృతిని కాపాడలేని ప్రభుత్వాలకు పాలించే హక్కు లేదన్నారు. ప్రభుత్వం ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలోనే బోధించేలా చర్యలు తీసుకోవాలని.. లేదంటే ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details