విశాఖ జిల్లా చీడికాడ మండలం ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకుడు యెన్నంశెట్టి శ్రీను కరోనాతో మృతి చెందారు. వారం రోజుల క్రితం అతనికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ.. తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం మృతి చెందినట్లు ఏపీఓ నాగరాజు తెలిపారు.
ఆయన స్వగ్రామం మాడుగుల మండలం వాడపాడు. మండలంలో ముగ్గురు వీఆర్వోలకు మూడు రోజుల కిత్రం కరోనా పాజిటివ్ వచ్చిందని ఉప తహసీల్దార్ శ్రీరామ్మూర్తి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీఓ సూచించారు.