సర్వ శిక్ష అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా 221 కస్తూర్బా గాంధీ పాఠశాలలను మూడేళ్ల కిందట ప్రారంభించారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లోనూ ఈ పాఠశాలలు ఉన్నాయి. ఇంటర్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఒక్కొక్క గ్రూపులో 40 మంది చొప్పున.. రెండింటిలో 80 మంది ఉంటారు. పాఠశాలలు ప్రారంభించారు కానీ.. మౌలిక సదుపాయాలు కల్పించటంతోపాటు.. పూర్తిస్థాయి అధ్యాపకులను నియమించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు.
పాఠశాల ఉపాధ్యాయులే బోధన: చాలా కస్తూర్బాల్లో జూనియర్ లెక్చరర్స్ లేక విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇంటర్ విద్యార్థులకు పాఠాలు చెప్పే అధ్యాపకులు లేకపోవడంతో.. పాఠశాలలోని 6 నుంచి పదో తరగతి వరకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే వారికీ చదువు చెబుతున్నారు.