వెబ్ కౌన్సెలింగ్ రద్దుచేసి.. మాన్యువల్ విధానంలో బదిలీలు చేపట్టాలని విశాఖ జిల్లా మాడుగుల మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. బదిలీలు పేరుతో ప్రభుత్వం మనోవేదనకు గురిచేస్తోందని అన్నారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తమని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. బదిలీల విషయంలో ప్రభుత్వం ఇకనైనా మొండివైఖరి విడనాడాలని.. లేకుంటే నిరసన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి.
వెబ్ కౌన్సెలింగ్ వద్దంటూ ఉపాధ్యాయ సంఘాలు నిరసన - ఉపాధ్యాయ సంఘాల నిరసన
వెబ్ కౌన్సెలింగ్ రద్దుచేసి.. మాన్యువల్ విధానంలో బదిలీలు చేపట్టాలని విశాఖ జిల్లా మాడుగుల మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. బదిలీల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని, లేకుంటే నిరసన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి.
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయండి