ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నంలో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య - నర్సీపట్నంలో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

విశాఖ జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో ఓ ఉపాధ్యాయురాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Teacher commits suicide at narsipatnam
నర్సీపట్నంలో ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

By

Published : Aug 12, 2020, 11:46 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో జీ. కామేశ్వరి అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కామేశ్వరి కొయ్యూరు మండలం చిట్టెంపాడు గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.

ఆమె భర్తతో విభేదాల కారణంగా సుమారు రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా నివసిస్తోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో పక్కనే ఉన్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details