ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వానికి ఎస్సీలంటే చిన్నచూపు: వంగలపూడి అనిత

ఎస్సీలపై దాడుల ఘటనల్లో వైకాపా ప్రభుత్వంపై తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఎస్సీలంటే ప్రభుత్వానికి చిన్నచూపని.. వైకాపాలో ఎస్సీ నాయకులకు స్వేచ్చ లేదని ఆరోపించారు.

tdp woman leader vangalapudi anitha criticises ycp government
వంగలపూడి అనిత

By

Published : Aug 29, 2020, 7:11 PM IST

చేతకాని ప్రభుత్వం ఉండబట్టే వ్యవస్థ అంటే ఎవరికీ భయం లేకుండా పోతోందని... తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖలో జరిగిన శిరోముండనం ఘటనపై స్పందించినట్లు.. పోలీసులు మిగతా ఘటనల్లో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎస్సీలంటే చిన్నచూపని ఆరోపించారు.

హోం మంత్రి, వైకాపా ఎస్సీ నాయకులు.. అన్యాయం జరిగిన ఎస్సీలను ఎప్పుడైనా పరామర్శించారా అని అనిత ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వంలో ఎస్సీ నాయకులకు స్వేచ్ఛ లేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమే తప్ప మరేం లేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీల మీద దాడులు జరిగాయనిమాట్లాడుతున్న నేతలు.. వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details