తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్.. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే వేధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. అవాస్తవాలతో పల్లా ఆస్తులపై దాడులకు తెగబడ్డారని ధ్వజమెత్తారు. దౌర్జన్యాలకు పాల్పడుతోన్న వైకాపా నాయకులను వదిలేసి.. ప్రశ్నిస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సబ్బం హరి, వెలగపూడి రామకృష్ణ, గీతం విద్యాసంస్థలపై దాడులు అదే కోవకు చెందినవన్న ఆయన.. పల్లా శ్రీనివాసులు ఆస్తుల విషయంలో మంత్రి అవంతి అసత్యాలు చెప్పారన్నారు. ప్రశాంతతకు మారు పేరైన విశాఖలో విద్వేషాలు రెచ్చగొడుతున్న అధికార పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని నజీర్ హెచ్చరించారు.
'అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వేధింపులు' - tdp state secretery criticize ysrcp news
ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఓ ప్రకటనలో విమర్శించారు. జగన్ ప్రభుత్వం విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందన్నారు.
!['అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వేధింపులు' tdp state secretery news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12119075-198-12119075-1623591386337.jpg)
tdp state secretery news