రాష్ట్రంలో ప్రజల మనుగడ కష్టంగా మారిందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ విశాఖలో అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని నజీర్ మండిపడ్డారు. నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి అధికారుల దాష్టికమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా పార్టీకి చెందిన దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా నాయకులపై జరుగుతున్న దాడులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
'తెదేపా నేతలపై జరుగుతున్న దాడులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి' - Tdp State Secretary news
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ విశాఖలో అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్