ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సెలవు దినాల్లో విధ్వంసం.. రాష్ట్రంలో ఇదో కొత్త పథకం' - విశాఖ వార్తలు

విశాఖలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన స్థలంలో అధికారులు ఇష్టారీతిన ఫెన్సింగ్ తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సెలవు దినాల్లో విధ్వంసం అనే కొత్త పథకానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో ప్రభుత్వం విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

TDP state president Achennaidu
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

By

Published : Jun 13, 2021, 1:43 PM IST

వైకాపా నేతల రాక్షసత్వం రోజురోజుకీ పెరిగిపోతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రశ్నిస్తే వేధింపులు... అక్రమాలను అడ్డుకుంటే విధ్వంసాలా? అని నిలదీశారు. "పల్లా శ్రీనివాసరావు ఆస్తులపై దాడులు.. బలహీనవర్గాలపై దాడులు చేయడమే" అన్నారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో ప్రభుత్వం విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

విశాఖలో భూముల అమ్మకాలను ప్రశ్నించినా... వైకాపా నాయకుల అక్రమాలను అడ్డుకున్నా దాడులకు పాల్పడతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవు దినాల్లో విధ్వంసం అనే కొత్త పథకానికి జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details