దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెదేపా దళిత మహిళలు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. తెదేపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దళిత మహిళ రాష్ట్ర హోం మంత్రిగా ఉంటూ.. ఎస్సీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
'సీఎం సొంత నియోజకవర్గంలో మహిళలకు రక్షణ కరవు' - తెదేపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ వార్తలు
తెదేపా ఎస్సీ సెల్ మహిళలు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఎస్సీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర హోం మంత్రి స్పందించకపోవడం శోచనీయమన్నారు.
మహిళలకు రక్షణ కరవు