ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"వైకాపా నేతల నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకుందాం"

TDP ROUND TABLE MEETING: గతంలో ప్రత్యేకహోదా కోసం ఉద్యమం పేరుతో నాటకాలాడిన కొందరు మేధావులు, వైకాపా నేతలు.. ఇప్పుడు 3 రాజధానుల పేరుతో మరో డ్రామాకు తెరలేపారని.. ఉత్తరాంధ్ర నేతలు ఆరోపించారు. ఉత్తరాంధ్రను రక్షించుకుందాం అనే నినాదంతో విశాఖలో ఉత్తరాంధ్ర నేతలతో రౌండ్‌ టేబుల్‌ నిర్వహించారు. వైకాపా నుంచి ఉత్తరాంధ్రను, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని.. అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నేతలు పిలుపిచ్చారు.

TDP ROUND TABLE MEETING
TDP ROUND TABLE MEETING

By

Published : Oct 15, 2022, 5:20 PM IST

Updated : Oct 15, 2022, 8:19 PM IST

వైకాపా నేతల నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకుందాం

TDP ROUND TABLE MEETING : విశాఖ పాలనా రాజధానికాదని.. విజయసాయిరెడ్డి రాజధానిగా మారిందని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు. వైకాపా బారి నుంచి.. ఉత్తరాంధ్రను కాపాడుకుందాం అనే నినాదంతో.. విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన చర్చావేదికలో.. పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. బీసీల కంచుకోటైన ఉత్తరాంధ్రలో.. ఎక్కడ నుంచో వచ్చిన నేతలు గర్జన పెట్టడం ఏంటని నిలదీశారు.

ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే వైకాపా నాటకం : మూడు రాజధానులపై ప్రైవేటు బిల్లు పెట్టిన పార్టీ.. ప్రజలను మభ్యపెట్టి, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ తెదేపా కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్​ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మాన ప్రసాదరావుకి విశాఖ రాజధాని మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని.. భూములు కాజేసిన చరిత్ర ఆయనదన్నారు.

అమరావతి రైతులు ఎలా వస్తారని బొత్స, తమ్మినేని ప్రశ్నిస్తున్నారని.. అంధ్రప్రదేశ్ మీ జాగీరా అని నిలదీశారు. రాజధాని లేకపోయినా విశాఖ అభివృద్ధి జరుగుతుందని.. దేశంలో ఇప్పటికే అగ్రశ్రేణి పది నగరాల్లో ఒకటిగా విశాఖ ఉందన్నారు. రాజధానిలా లేకపోయినా విశాఖ అభివృద్ధి జరుగుతూనే ఉంటుందన్నారు.

మూడు ముక్కలాడితే అభివృద్ధి జరగదని.. విశాఖలో మొత్తం దోపిడి జరుగుతోందన్నారు. ప్రజలు తిరగబడకపోతే.. రేపు ఇళ్లలోంచి బయటకు తీసుకువచ్చి ఆక్రమించే పని జరిగినా అశ్చర్యపోనవసరం లేదన్నారు. అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అనే దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని.. తెలుగుదేశంపార్టీ, అచ్చెన్నాయుడు ఒకటే మాటమీద ఉంటారన్నారు.

అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా మట్లాడావా అని జగన్​ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా దిల్లీలో ప్రధానిని కలిస్తే ధైర్యంగా వచ్చి ప్రెస్​మీట్​ పెట్టి తాము అడిగిన విషయాలను చెబుతారని.. కానీ కేవలం తన కేసుల మాఫీ గురించే దిల్లీకి వెళ్లిన జగన్ ఏం చెప్పగలరన్నారని ఎద్దేవా చేశారు. రెండు లక్షల మందితో విశాఖ గర్జన నిర్వహిస్తామని బీరాలు పలికిన వారి గర్జన చూశామన్నారు.

విశాఖ ఎప్పుడో ఆర్థిక రాజధానిగా ఉందని.. సిగ్గూ లేకుండా రాజీనామా డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. వైకాపా దొంగల నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

విశాఖ ఆర్థిక రాజధాని అయ్యేలా కృషి చేద్దాం: అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని.. విశాఖ ఆర్థిక రాజధాని అయ్యేలా కృషి చేద్దామని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ‌అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నేతలందరూ హాజరయ్యారు. మన ప్రాంతానికి వస్తున్న రాజధాని రైతులుకు మన వంతుగా పూర్తి సహకారమందిద్దామని అయ్యన్న అన్నారు.

వాళ్లు అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారంతా తమకు పరిపాలన చేయడం చేతకాదని చెప్పి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్​నాయుడు సూచించారు. మూడున్నరేళ్లుగా ఉత్తరాంధ్రకు ఏమీ చేయకుండా ఇప్పుడీరకంగా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాల్సింది పోయి విశాఖ రాజధాని ద్వారా అవి ఎలా పరిష్కారమవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మాయమాటలు చెప్పడానికి మొట్టమొదటి బ్యాచ్ వైకాపా నేతలు, మంత్రులన్న అయన.. స్టీల్ ప్లాంట్ వల్ల ఎంతో మందికి ఉపాధి లభించిందని, దీనిని ప్రయివేటీకరణ చేస్తామన్నప్పుడు అమర్నాథ్​, ధర్మాన, సీదిరి అప్పలరాజులు రాజీనామా చేయకుండా ఎక్కడ కూర్చున్నారన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 15, 2022, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details