ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు'

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ కేంద్రంలో తేదేపా నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

tdp protesting rally against the vizag steel privatization
ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు

By

Published : Feb 19, 2021, 4:45 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షమే ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో ఎలమంచిలిలో ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్​ఛార్జీ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తలతో పెద్దఎత్తున బైకు ర్యాలీ చేపట్టారు. నినాదాలు చేశారు.

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పార్టీలకతీతంగా భారీ ఎత్తున్న ఆందోళన చేస్తున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవడం దారణమన్నారు. ఈ ర్యాలీలో తెదేపా నాయకులు కొలకలూరి విజయబాబు, కాండ్రకోట చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details