ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ బిల్లులు తగ్గించాలని తెదేపా ఆధ్వర్యంలో నిరసన - tdp protest latest news

ప్రభుత్వం విద్యుత్ బిల్లులు రెట్టింపు స్థాయిలో పెంచిందని, తక్షణమే వాటిని రద్దు చేయాలని మాడుగుల నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్, మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు డిమాండ్ చేశారు.

TDP protest in madugula over power bills hike
విద్యుత్ చార్జీలు తగ్గించాలని తెదేపా ఆధ్వర్యంలో నిరసన

By

Published : May 21, 2020, 9:21 PM IST

కరోనా కష్ట కాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలను మరింత అవస్థలకు గురిచేయడానికి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు రెట్టింపు స్థాయిలో పెంచిందని, తక్షణమే వాటిని రద్దు చేయాలని విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్, మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు తెదేపా కార్యాలయంలో నిరసన చేపట్టారు. రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details