టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలని కోరుతూ విశాఖ జీవీఎంసీ కార్యాలయాన్ని తెలుగు యువత నాయకులు ముట్టడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు పూర్తయినా, లబ్ధిదారులకు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని రాష్ట్ర తెదేపా కార్యదర్శి, విశాఖ తెలుగు యువత అధ్యక్షుడు నోడగల కృష్ణ అన్నారు.
జీవీఎంసీ బైఠాయించి నిరసన చేపట్టారు. కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీసం వినతి పత్రం ఇవ్వడానికి కూడా కార్యాలయంలోనికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.