పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ విశాఖ జిల్లా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. జగన్ తన ఏడాది పాలనలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేశారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు . ఏడాది కాలంలో రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని పేర్కొన్నారు. లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పెంచిన విద్యుత్ ఛార్జీల భారంగా మారాయని వివరించారు. విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని పార్టీ తరఫున డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో విద్యుత్ రంగానికి విద్యుత్ రంగానికి కేంద్రం నుంచి అవార్డులు వస్తే జగన్ పాలనలో ప్రజల నుంచి చీవాట్లు వస్తున్నాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచమని అవసరమైతే తగ్గిస్తామని చెప్పిన సంగతి గుర్తు చేశారు.
'ఒక్కసారి అవకాశమని.. ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తున్నాడు' - tdp protest against electricity bills
పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా నేతలు నిరసన దీక్ష చేపట్టారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ దుయ్యాబట్టారు.
!['ఒక్కసారి అవకాశమని.. ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తున్నాడు' vishaka district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7290495-960-7290495-1590060163165.jpg)
'ఒక్కసారి అవకాశమని.. ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తున్నాడు'