అరకులో తెదేపా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర
విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో తెదేపా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర జరుగుతోంది. మాజీ మంత్రి కిడారి శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో మామిడివలస గ్రామంలో ప్రజా చైతన్య యాత్రను నిర్వహించారు. ప్రభుత్వం పేదల పట్ల వివక్షతో పథకాలు తీసివేస్తున్నారని ఆయన అన్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు కోతలు విధిస్తుండడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
అరకులో తెదేపా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర