గిరిజనులకు ఉద్యోగ అవకాశం కల్పించే జీవో నెంబర్ 3 సాధించేందుకు తెదేపా పోరాడుతుందని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. విశాఖ ఏజెన్సీ పాడేరులో పర్యటించిన ఆయన.. ప్రభుత్వానికి గిరిజనుల మీద చిత్తశుద్ధి లేదన్నారు.
'జీవో నెంబర్ 3 సాధనకు తెదేపా కృషి చేస్తుంది' - latest news on go number 3
గిరిజనుల అభివృద్ధి కోసం జీవో 3 సాధించేందుకు తెదేపా కృషి చేస్తుందని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. తెదేపా గిరిజనులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
జీవో నెంబర్ 3పై తెదేపా
జీవో నెంబర్ 3 సాధనకు ముఖ్యమంత్రి జగన్కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారని గుర్తు చేశారు. ప్రభుత్వం జీవో 3 సాధన కోసం ప్రయత్నాలు చేయకపోతే.. గిరిజనులకు తెదేపా అండగా ఉంటుందన్నారు. పాడేరు, అరకులోయలోని స్థానిక నేతలతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: పర్చూరులో పాముల సయ్యాట