తెలుగుదేశం పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు దక్కిన నాయకులు హర్షం వ్యక్తంచేశారు. అధినేత ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రకటించారు. పదవులు వచ్చిన నేతల అనుచరులు కేకులు కోసి సంబరాలు చేసుకున్నారు. కొన్నిచోట్ల టపాసులు కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తంచేశారు. నాయకులకు శాలువాలు కప్పి అభినందించారు. ముందునుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు మరోసారి పెద్దపీట వేశారంటూ... అధినేత చంద్రబాబుకు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు.
నియోజకవర్గ బాధ్యతలు దక్కిన నాయకుల హర్షం - TDP New Appointed Candidates Happy news
తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు దక్కిన నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రకటించారు. ముందునుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు మరోసారి పెద్దపీట వేశారంటూ... అధినేత చంద్రబాబుకు నేతలు కృతజ్ఞతలు తెలిపారు
నియోజకవర్గ బాధ్యతలు దక్కిన నాయకుల హర్షం