ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

nara lokesh: 'అధికారుల నిర్లక్షంతోనే ఆ ఉపాధ్యాయుడి మృతి' - విశాఖ పట్నం

అధికారుల నిర్లక్ష్యం వల్లే సీలేరుకు చెందిన కిరసాని విశ్వనాథం అనే ఉపాధ్యాయుడు మృతి చెందాడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​(nara lokesh) ఆరోపించారు. అతనికి వేతనం ఇచ్చి ఉంటే చనిపోయే వారు కాదన్నారు.

Lokesh
నారా లోకేష్

By

Published : Jun 27, 2021, 10:24 PM IST

విశాఖ జిల్లా సీలేరులో కిరసాని విశ్వనాథం అనే ఉపాధ్యాయుడి మృతికి అధికారుల తీరే కారణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​(nara lokesh) మండిపడ్డారు. వేతనం ఇచ్చిఉంటే ఆయన మరణించేవారు కాదన్నారు.

ఇప్పటికైనా స్పందించి విశ్వనాథానికి రావాల్సిన వేతన బకాయిలు, 50 లక్షల ఎక్స్ గ్రేషియా కుటుంబ సభ్యులకు చెల్లించాలన్నారు. వారి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

హుకుంపేట మండలం గడుగుపల్లి వాసి కిరసాని విశ్వనాథం..సీలేరు గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కాగ ఇటీవల ఆయన అనారోగ్యం పాలయ్యాడు. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక మృతి చెందాడు.

ఇదీ చదవండి:Teacher: తొమ్మిది నెలలుగా వేతనాలు లేక... ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

ABOUT THE AUTHOR

...view details