రైతు ప్రభుత్వమని చెప్పుకునే వైకాపా... రైతులను పట్టించుకోవడంలేదని తెదేపా ఎమ్మెల్సీలు నాగ జగదీశ్వరరావు, పప్పల చలపతిరావు పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన తుపాన్‌తో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్టీవో సీతారామారావుకి వినతిపత్రం అందజేశారు.
'వైకాపా అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి' - అనకాపల్లి ఆర్డీవో సమాచారం
వైకాపా అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని తెదేపా ఎమ్మెల్సీలు బుద్ధ నాగ జగదీశ్వరరావు, పప్పల చలపతిరావు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్టీవో సీతారామారావుకి వినతిపత్రం అందజేశారు.
విశాఖ గ్రామీణ జిల్లాలో తొమ్మిది మంది రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటే వీరిలో రెండు కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని చెప్పారు. మిగిలిన 7 కుటుంబాలకు 7 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చోడవరం ఎలమంచిలి నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు బత్తుల తాతయ్య బాబు, ప్రగడ నాగేశ్వరరావు, తెలుగు రైతు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గొల్లవిల్లి శ్రీరామ్మూర్తి, ఉగ్గిని రమణమూర్తి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆడారి మంజు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రుణ యాప్ బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు: ఏసీపీ శ్రావణ్‌కుమార్