విశాఖలోని తాటిచెట్లపాలెం జాతీయ రహదారి పక్కన ఉన్న అన్న కాంటీన్ వద్ద తెదేపా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను అర్ధాంతరంగా నిలిపివేయడం చాలా దారుణమని అన్నారు. పేదలు ఆకలి మంటలకు గురికాకుండా ప్రభుత్వానికి నచ్చిన పేరు పెట్టుకుని క్యాంటీన్లను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అన్న క్యాంటీన్లు కొనసాగించాలంటూ తెదేపా నేతల నిరసన - mlc
మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు.
తెదేపా నిరసన