ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆవఖండంలోని అక్రమ లేఅవుట్లను తొలగించాలి' - visakha dist latest news

విశాఖ జిల్లా అనకాపల్లి ఆవఖండంలో అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ... పంట కాల్వలు, వర్షపు నీరు ప్రవహించే కాల్వలు పూడ్చేసి లేఅవుట్లు వేశారని గుర్తించారు. ఈ లేఅవుట్ల వల్ల భారీ వర్షం వస్తే అనకాపల్లి ముంపునకు గురవుతుందన్నారు. అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి అక్రమ లేఅవుట్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

'ఆవఖండంలోని అక్రమ లేఅవుట్లను తొలగించాలి'
'ఆవఖండంలోని అక్రమ లేఅవుట్లను తొలగించాలి'

By

Published : Jun 30, 2020, 5:12 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆవఖండం ప్రాంతంలో అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు. ఈ లేఅవుట్ల వల్ల అనకాపల్లి ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. లేఅవుట్లను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ డిమాండ్​ చేశారు. ఆవఖండంలోని లేఅవుట్లు ఆయన పరిశీలించారు.

ఆవఖండంలోని సుమారు 25 ఎకరాల స్థలంలో అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారని ఎమ్మెల్సీ అన్నారు. రైతుల పంట పొలాలకు నీరు వచ్చే కాల్వలను పూడ్చేసి లేఅవుట్లు వేయడం దారుణమన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామన్నారు. వర్షపు నీరు ఆవఖండం నుంచి ప్రవహించి గవర్ల అనకాపల్లి చేరుకుంటుందన్నారు. లేఅవుట్ల వల్ల కాల్వలు మూసేయడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు అనకాపల్లి పట్టణ ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్రమ లేఅవుట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :ప్రభుత్వ స్కీమ్​లన్నీ స్కాంల కోసమే: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details