విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని మురికినీటి శుద్ధి ప్లాంటును తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు పరిశీలించారు. అయిదు నెలల నుంచి ఇక్కడ మోటార్లు పని చేయడం లేదన్నారు. పనితీరు బాగా లేని మోటార్లను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల.. అవి తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి.. ప్లాంట్ నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లి మురుగునీటి శుద్ధి ప్లాంటును పరిశీలించిన ఎమ్మెల్సీ బుద్ధా - తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా పర్యటన
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో మురికినీటి శుద్ధి ప్లాంటు నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు ఆరోపించారు. ప్లాంట్ను పరిశీలించిన ఆయన.. మోటార్లు పని చేయకపోవడం వల్ల శుద్ధి జరగడం లేదని పేర్కొన్నారు.
అనకాపల్లి మురుగునీటి శుద్ధి ప్లాంటును పరిశీలించిన తేదేపా ఎమ్మెల్సీ బుద్ధా