ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ద్రవ్య వినిమయ బిల్లును తెదేపా అడ్డుకోలేదు' - ఏపీ శాసనమండలి వార్తలు

మండలిలో మనీ బిల్లును తెదేపా అడ్డుకోలేదని.. దీనిపై వైకాపా మంత్రులు దుష్ర్పచారం చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు అన్నారు. శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుల తీరు చాలా దారుణంగా ఉందని విమర్శించారు.

tdp mlc budda naga jagadeswara rao fires on ycp ministers
బుద్దా నాగ జగదీశ్వరరావు, తెదేపా ఎమ్మెల్సీ

By

Published : Jun 18, 2020, 9:41 PM IST

శాసనమండలిలో వైకాపా మంత్రులు దౌర్జన్యంగా ప్రవర్తించారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు విమర్శించారు. విశాఖలో మాట్లాడుతూ.. మండలిలో తీవ్ర పరిణామాలు జరిగాయన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును తెదేపా ఆపేసిందంటూ వైకాపా సభ్యులు దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.

మనీ బిల్లు పాస్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రయత్నించిందని.. అధికార పక్షం అందుకు సహకరించలేదని తెలిపారు. మంత్రులు అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్​లు దారుణంగా మాట్లాడరని చెప్పారు. అనిల్ తనపై దాడికి ప్రయత్నించారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details