ఎమ్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా విశాఖలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ధర్నాకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కేజీహెచ్ వద్ద జూడాలు, డాక్టర్లు చేస్తున్న నిరసనకు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్ కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు. వైద్యులు చెబుతున్న న్యాయపరమైన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతి, విజయవాడలో జూడాలతో పోలీసుల తీరు అమానుషమనీ, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
'జూడాలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి' - undefined
ఎన్ఎమ్సీ బిల్లును రద్దు చేయాలని జూడాలు నిర్వహిస్తున్న నిరసన పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సరికాదని తెదేపా ఎమ్మెల్యేలు అన్నారు. ప్రభుత్వం తక్షణమే జూడాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
జూడాల నిరసన