విశాఖ తూర్పు నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ కరోనా కట్టడి చేయడంలో అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేశారని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపిస్తున్నారు. తన నియోజక వర్గంలో పాజిటివ్ కేసులు వచ్చిన కుటుంబాలకు కొవిడ్ పరీక్షలు చేయని ప్రభుత్వం... రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేశామని చెప్పుకోవడం దారుణమన్నారు. మనిషికి మూడు చొప్పున 16కోట్ల మాస్కులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. కనీసం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వచ్చిన రోగుల విషయంలో కూడా ప్రభుత్వం అత్యంత ఘోరంగా వ్యవహరిస్తోందని చెప్తున్న విశాఖ తూర్పు నియోజక శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'కొవిడ్ కేసులు పెరుగుతున్నా...అధికారులు పట్టించుకోవడం లేదు' - విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వార్తలు
విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
!['కొవిడ్ కేసులు పెరుగుతున్నా...అధికారులు పట్టించుకోవడం లేదు' tdp Mla Velagapudi ramakrishnababu Interview On Carona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7913662-883-7913662-1594029043564.jpg)
విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో ముఖాముఖి
ఇవీ చదవండి: