ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ పరీక్షల ఫలితాలు వేగంగా వచ్చేలా చూడాలి' - తెదేపా ఎమ్మెల్యే రామకృష్ణబాబు వార్తలు

కొవిడ్ పరీక్షల ఫలితాలు వేగంగా వచ్చేలా చూడాలని.. లేకపోతే వైరస్ వ్యాప్తి అధికమవుతుందని విశాఖ జిల్లా తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు అన్నారు. జిల్లాలో మరణాల సంఖ్య అధికంగా ఉందని.. సరైన వైద్య సదుపాయాలు లేకనే మృతుల సంఖ్య పెరుగుతోందని ఆరోపించారు.

tdp mla velagapudi ramakrishna babu about corona in vizag
వెలగపూడి రామకృష్ణబాబు

By

Published : Aug 5, 2020, 8:25 PM IST

విశాఖ జిల్లాలో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయని.. సరైన వైద్య సదుపాయాలు లేకే మృతుల సంఖ్య పెరుగుతోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. మరణాల సంఖ్య విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కొవిడ్ పరీక్షల ఫలితాలు వేగంగా వచ్చేలా చూడాలని.. లేకపోతే వైరస్ వ్యాప్తి అధికమవుతుందన్నారు. కరోనా బాధితులను గుంపులు గుంపులుగా బస్సులో తీసుకెళ్లడం సరికాదని సూచించారు. జిల్లాలో హోం ఐసోలేషన్​లో ఉన్నవారికి ఒక్క కిట్ కూడా అందలేదన్నారు. కరోనాతో మృతి చెందిన వారికోసం ఊరి శివార్లలో ఖననానికి ఏర్పాట్లు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details