ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: వాసుపల్లి - ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వార్తలు

ముస్లిం మైనారిటీలకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆరోపించారు. తెదేపా హయాంలో ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

tdp mla vasupalli
tdp mla vasupalli

By

Published : Jul 18, 2020, 6:37 PM IST

ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వం న్యాయం చేయాలని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. ప్రభుత్వం ముస్లింలను మోసం చేస్తుందని.. తెదేపా హయాంలో ముస్లింలకు ఇచ్చిన పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. కేవలం నవరత్నాలను మాత్రమే చూస్తున్నారని.. రాష్ట్రంలో 31 శాతం మంది ముస్లింలు దారిద్య్ర రేఖకు దిగువ ఉన్నారని అన్నారు.

అలాగే హజ్ యాత్ర భవనాల కోసం స్థలాలు కేటాయిస్తే వాటిని ఆపేశారని వాసుపల్లి మండిపడ్డారు. దూదేకుల ఫెడరేషన్ ఎటు పోయిందో తెలియడం లేదన్న ఆయన.. ఎన్​ఆర్సీ మీద రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తుందని ఆరోపించారు. విశాఖలో అంగడిదిబ్బ కోసం ప్రయత్నాలు చేసినా.. ప్రభుత్వం స్పందించ లేదన్నారు.

ఇదీ చదవండి:గవర్నర్​ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు

ABOUT THE AUTHOR

...view details