చంద్రబాబును అడ్డుకున్న వారిలో వైకాపా నాయకులు, కార్యకర్తలే ఉన్నారని సీపీ ఆర్కే మీనాకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఫిర్యాదు చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా శ్రేణులు విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని రామకృష్ణ విమర్శించారు.
విశాఖ ఘటనపై సీపీ ఆర్కే మీనాకు తెదేపా ఎమ్మెల్యే ఫిర్యాదు - సీపీ ఆర్కే మీనాకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ న్యూస్
తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో వైకాపా ఆందోళనకారులు అడ్డుకున్న ఘటనపై తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ సీపీ ఆర్కే మీనాకు ఫిర్యాదు చేశారు. సీపీకి జరిగిన ఘటనలు వివరించారు.
'విశాఖ ప్రతిష్టపోయేలా వైకాపా నేతలు చేస్తున్నారు'