రాష్ట్రంలో ప్రస్తుతం రౌడీల పాలన సాగుతోందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తాను గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఇలాంటి పాలన ఎప్పుడు చూడలేదని విమర్శించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో తెదేపా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ రెడ్డికి ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మెుత్తం నాశనం చేశారన్నారన్నారు. రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉండగా ఇలాంటి బెదిరింపు పాలన ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. విశాఖ ఉక్కు పరిశ్రమ భూములను కాజేసేందుకు విజయసాయిరెడ్డి విశాఖలో మకాం వేశారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
'రాష్ట్రంలో ఇలాంటి పాలనను ఎప్పుడు చూడలేదు" - పాయకరావుపేటలో తెదేపా సమావేశం
రాష్ట్రంలో రౌడీల పాలన సాగుతోందని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన తెదేపా కార్యాకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు.
సమావేశంలో మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు