ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ కార్పొరేషన్ తెదేపా కంచుకోట: నిమ్మల రామానాయుడు - visakha tdp latest news

విశాఖ కార్పొరేషన్ తెదేపా కంచుకోట అని... త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

tdp on gvmc elections
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తెదేపా కంచుకోట

By

Published : Feb 28, 2021, 11:58 AM IST

విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా తెదేపా పని చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి రామానాయుడు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై జీవీఎంసీలోని అన్ని డివిజన్​ల పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులకు సీనియర్ నేతలు దిశానిర్దేశం చేశారు.

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తెదేపా కంచుకోటగా రామానాయుడు అభివర్ణించారు. ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్, విశాఖ పార్లమెంటరీ పార్టీ నాయకులు భరత్, ఇతర నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details