ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bandh Effect in Vishaka : విశాఖలో తెదేపా నేతల అరెస్టులు.. నిర్బంధాలు - అనకాపల్లిలో తెదేపా నేతల అరెస్టు వార్తలు

రాష్ట్రంలో తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులను ఖండిస్తూ.. తెదేపా అధినేత చంద్రబాబు నేడు రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లావ్యాప్తంగా తెదేపా నేతలు.. పలు పట్టణాల్లో నిరసనలు చేపట్టారు. అడ్డుకున్న పోలీసులు.. పలువురు నేతలను అరెస్టు చేశారు. మరికొందరిని గృహ నిర్బంధం చేశారు.

tdp protests and some party leaders were arrested in vishaka
జిల్లాలో తెదేపా నిరసనలు.. ముందస్తుగా పార్టీ నేతల అరెస్టులు

By

Published : Oct 20, 2021, 12:55 PM IST

రాష్ట్రంలో తెదేపా నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాల(attack on tdp offices)పై వైకాపా(ycp) దాడులను ఖండిస్తూ.. నేడు రాష్ట్ర బంద్(ap bandh)​కు ఆ పార్టీ అధినేత చంద్రబాబు(tdp chief chandrababu) పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా(vishakapatnam)లో పలువురు తెదేపా నేతలు.. పలు పట్టణాల్లో నిరసనలు, ర్యాలీలు చేపట్టారు.

చోడవరంలో..
విశాఖ జిల్లా చోడవరం(chodavaram)లో తెదేపా నేతలు బంద్(tdp bandh)​ నిర్వహించారు. తెలుగు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు సారధ్యంలో.. ఆ పార్టీ నాయకులు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బంద్ ప్రశాంత వాతావరణంలో సాగింది. ముందస్తు చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాడేరు ఏజెన్సీలోనూ బంద్ ప్రశాంతంగా సాగింది. పార్టీ శ్రేణులు శాంతియుతంగా ర్యాలీ చేపట్టాయి.

మద్దిలపాలెంలో..
మద్దిలపాలెం(maddilapalem) వద్ద టీడీపీ ఎస్సీ సెల్ (tdp sc cell)అధ్యక్షుడు విజయకుమార్, జిల్లా అధికార ప్రతినిధి యల్లపు శ్రీనివాసరావులు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పోలీసులు వీరిని అడ్డుకుని అరెస్ట్(arrest) చేశారు.

పెందుర్తి, గాజువాకలో..
పెందుర్తి(pendurthi)లో.. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి (ex minister bandaru satyanarayanamurthy)ని పరవాడ పోలీసులు గృహనిర్భందం(house arrest) చేశారు. గాజువాక(gajuwaka) నియోజకవర్గంలో 10 మంది తెదేపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్, కార్పొరేటర్ రౌతు శ్రీనివాసు, దువ్వాడ పోలిసులు అరెస్ట్ చేశారు.

అరకులో..
అరకు లోయ(araku)లో మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్(ex minister kidari sravan) ఆధ్వర్యంలో.. తెదేపా శ్రేణులు బంద్ నిర్వహించారు. రహదారికి అడ్డంగా కూర్చుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనకాపల్లిలో..
అనకాపల్లి(anakapally)లో ఆర్టీసీ బస్సులు ఆపేందుకు యత్నించిన తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెదేపా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

భీమిలిలో..
భీమిలి(bheemili) తెదేపా నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. అర్ధరాత్రి అరెస్టులు అన్యాయమని తెదేపా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

TDP Nirasana : తెదేపా నిరసన గళం.. పోలీసు అరెస్టుల పర్వం..

ABOUT THE AUTHOR

...view details