ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గీతం వ్యవస్థాపకుడు మూర్తి వర్థంతి-తెదేపా నేతల నివాళులు - TDP leaders tribute to Geetham founder MVVS Murthy on his 2nd death anniversary

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గీతం వ్యవస్థాపకుడు ఎం.వి.వి.ఎస్ మూర్తి రెండో వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖ జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించారు.

TDP leaders tribute to Geetham founder MVVS Murthy on his 2nd death anniversary
గీతం వ్యవస్థాపకుడు మూర్తి వర్థంతి-తెదేపా నేతల నివాళులు

By

Published : Oct 2, 2020, 6:36 PM IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గీతం వ్యవస్థాపకుడు ఎం.వి.వి.ఎస్ మూర్తి రెండో వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖ జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించారు. దివంగత నేత ఎం.వి.వి.ఎస్ మూర్తి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెంది నేటికి రెండేళ్లు గడిచింది. ఆయన వర్థంతి సందర్భంగా మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. గీతం విశ్వ విద్యాలయాన్ని స్థాపించి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, గీతం అధ్యక్షుడు ఎం. శ్రీ భరత్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: ఆదివాసీ పంటలకు అంతర్జాతీయ మార్కెటింగ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details