ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP leaders supported lawyers protest in vishaka కోర్టు కోర్టుకో చట్టమని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు... అయ్యన్నపాత్రుడు - TDP leaders supported lawyers protest in vishaka

TDP leaders supported lawyers protest in vishaka: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద న్యాయవాదులు నిరసన దీక్షకు దిగారు. టీడీపీ, జనసేన నేతలు వారికి సంఘీభావం ప్రకటించారు. ఆధారాలు లేని కేసులో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం దేశంలో ఎక్కడ జరగలేదని వారు మండిపడ్డారు. అధికారం ఉందని విర్రవీగుతున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP leaders supported lawyers protest in vishaka
TDP leaders supported lawyers protest in vishaka

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 6:22 PM IST

TDP leaders supported lawyers protest in vishaka: విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మద్దతు పలికారు. న్యాయవాదులకు మద్దతుగా... అయ్యన్న దీక్షా శిభిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా... సీఎం జగన్​పై విమర్శులు గుప్పంచారు. న్యాయవాదులు న్యాయం కోసం పోరాడడం.. ప్రస్తుత పాలన వైపరిత్యానికి అద్దం పడుతోందని ఆయన అన్నారు. కోర్టు కోర్టుకో న్యాయం.. కోర్టు కోర్టుకో చట్టం అని ఎన్టీఆర్ ఆనాడే సినిమాల్లోనే చెప్పారని అయ్యన్న గుర్తుచేశారు. కోర్టులో సామాన్యులకు సైతం న్యాయం జరగాలని పెద్దల కోరిక.. ఇప్పుడు సామాన్యులకు ఎక్కడ న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. క్రింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకూ న్యాయం ఎందుకు ఆలస్యం అవుతుందనేదే తన ఆవేదన అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు ఏనాడు తప్పుడు పనులు చేయండి అని చెప్పలేదని అయ్యన్న తెలిపారు.

TDP Protest Initiation Against Chandrababu Arrest: 'తెలుగుదేశం' దీక్షా పథం..! విజయవంతంగా ‘సత్యమేవ జయతే’

స్కిల్ డెవలప్మెంట్ పై గుజరాత్ వెళ్లి రమ్మని అప్పుడు కమిటీ వేశామని అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు. ఫైబర్ నెట్ అనేది క్యాబినెట్ నిర్ణయమని అయ్యన్న పేర్కొన్నారు. ఇడుపులపాయలోని ఐఐఐటీలో సైతం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టామని తెెలిపారు. కావాలంటే సీఎం వెళ్లి చూసుకోవాలంటూ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ పూర్తిగా కక్ష సాధింపు చర్య అని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులను ఎందుకు వదిలిపెట్టారంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. తనపై ఎన్నో కేసులు ఉన్నా... బెయిల్ మీద బయట తిరుగుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జైల్లో చంద్రబాబుకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు.. ఆయన పర్సనల్ డాక్టర్​ను అనుమతించవచ్చు కదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Atchannaidu Sensational Comments on CID: ఆధారాలు చూపలేక సీఐడీ మరోసారి బోల్తా పడింది: అచ్చెన్నాయుడు

చంద్రబాబును హతమార్చడానికి కుట్రపన్నుతున్నారని అయ్యన్న ఆరోపించారు. అదే జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సొంత బాబాయిని హత్య చేసిన వ్యక్తి ..ఇలా చెయ్యడని నమ్మకం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం ఆయన విలువ తెలియలేదని పేర్కొన్నారు. జగన్ గెలిచిన అనంతరం రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విలువ తెలిసిందని అన్నారు. చంద్రబాబు కోసం 98 దేశాల్లో ధర్నాలు చేశారని అయ్యన్న తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కొనేందుకూ... జనసేన, సీపీఐ, సీపీఎం టీడీపీ అందరం కలిసి వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. సీఎం జగన్ తన స్వంత తల్లిని, చెల్లిని తరిమేసిన వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని చంపేస్తే.. ఆ వ్యక్తిని జైలుకు వెళ్ళనివ్వకుండా బెయిల్ పై తిప్పుతున్న వ్యక్తి.. జగన్ అని అన్నారు. అమర్నాథ్ మంత్రి అయ్యాక విశాఖకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేది హోం మంత్రికి కూడా తెలియదన్నారు.

TDP leaders Fire on CM Jagan: సీఎంకు తెలియకుండానే చంద్రబాబు అరెస్టు జరిగిందా..! ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకే జగన్ నాటకాలు: టీడీపీ

ABOUT THE AUTHOR

...view details