ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి రైతులకు తెదేపా నేతల సంఘీభావం

ఏడాదిగా అలుపెరుగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు విశాఖ తెదేపా నేతలు సంఘీభావం తెలిపారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం మెుండిపట్టును వీడి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అమరావతి రైతులకు తెదేపా నేతల సంఘీభావం
అమరావతి రైతులకు తెదేపా నేతల సంఘీభావం

By

Published : Dec 17, 2020, 7:25 PM IST

రాజధాని అమరావతి కోసం ఏడాదిగా ఉద్యమం చేస్తున్న రైతులకు విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా నాయకులు సంఘీభావం తెలిపారు. గత 365 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని...రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.

అమరావతి రైతులకు మద్దతుగా చోడవరం పట్టణంలో తెదేపా నేతలు ర్యాలీ నిర్వహించారు. కాగా వారి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఒకే రాజధాని ముద్దు మూడు రాజధానులు వద్దు తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

విశాఖ తెదేపా కార్యాలయంలో అమరావతి రైతుల ఉద్యమానికి నేతలు సంఘీభావం తెలిపారు. ఏడాది కాలంగా ఎండ-వాన లెక్కచేయకుండా ఉద్యమాన్ని సాగించిన రైతులకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని నేతలు సూచించారు. ప్రభుత్వం మెుండిపట్టును వీడి అమరావతిగా రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

అమరావతిపై రెఫరెండానికి రెడీ..ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details