TDP leaders comments on MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్ మిస్సింగ్‌పై టీడీపీ నేతలు స్పందించారు. అసలు విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందా.. లేక నాటకాలు ఆడుతున్నారా అని టీడీపీ నేతలు ఆరోపించారు. విజయసాయి ఫోన్ పోయిందా? లేక జగన్ లాక్కున్నారా? అని మాజీమంత్రి జవహర్ ప్రశ్నించారు. విజయసాయి ఫోన్ పోయిందని నాటకాలు ఆడుతున్నారన్న జవహర్.. దిల్లీ లిక్కర్ స్కామ్ సమాచారమంతా ఆ ఫోన్‌లోనే ఉందని ఆరోపించారు. జగన్ సహా అందరి వాటాల సమాచారం ఆ ఫోన్‌లోనే ఉందన్న ఆయన.. ఈడీ విచారణలో బాగోతం బయటపడుతుందని నాటకం ఆడుతున్నారని అన్నారు.
ఆయనే పడేశాడు: విజయసాయిరెడ్డి ఫోన్ పోలేదు.. ఆయనే పడేశారంటూ తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. దిల్లీ లిక్కర్ స్కాంతో తాడేపల్లి ప్యాలస్ పూసాలు కదులుతున్నాయంటూ ట్వీట్ చేశారు. ఫోన్ దాచేసి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారంటూ ఆరోపించారు.