విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ తెదేపా నాయకులు నిరసన చేశారు. ఈ సందర్భంగా పాయకరావుపేట తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బంగారయ్య మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మూడు నెలలోనే ప్రజావ్యతిరేక విధానాలను అమలు పరుస్తూ.. రాక్షస పాలన సాగిస్తున్నారని అన్నారు. పేదలకు కడుపునిండా అన్నం పెట్టే అన్న కేంద్రం రద్దు చేసి పేదలకు కడుపు కొట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి చిట్టిబాబు, గొర్రెల రాజబాబు, మంజూరు నారాయణరావు, పెద్దిరెడ్డి శీను తదితరులు పాల్గొన్నారు.
పాయకరావుపేటలో తెదేపా ధర్నా.. - protests
ఇసుక విధానాన్ని నిరసిస్తూ పాయకరావుపేటలో తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు.
tdp leaders protests at payakaraopeta in vishakapatnam district