తెదేపా అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసుకు వ్యతిరేకంగా... శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తెదేపా నాయకులు ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ బాధ్యుడు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో నేతలు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం కృష్ణదాసుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ... ఎం.ఎం.నగర్ కూడలి వద్దనున్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. రాష్ట్రమంత్రిగా వ్యవహరిస్తూ...ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని జయకృష్ణ హితవు పలికారు. చంద్రబాబుకు తక్షణమే ధర్మాన.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.