ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని విశాఖ తెదేపా నేతలు కోరారు. బాధితులకు రూ. 20 లక్షలు ఇవ్వడమే ఎక్కువని.. అలాంటిది తమ ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం ఇస్తోందంటూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఆధ్వర్యంలో తెదేపా కార్యాలయంలో మౌన దీక్ష చేశారు. ఈ ప్రమాదంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు.
'ప్రమాదంపై సుప్రీం న్యాయమూర్తితో విచారణ చేయించాలి' - ఎల్జీ గ్యాస్ లీకేజీ తాజా వార్తలు
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని.. తెదేపా నేతలు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు.
విశాఖలో తెదేపా నేతల నిరసన