విశాఖపట్నం గాజువాక వాంబే కాలనీలో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని తెదేపా మహిళ అధ్యక్షురాలు అనిత, విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. అనంతరం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో చరవాణిలో మాట్లాడించారు. న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
'అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి' - తెదేపా నేత శ్రీనివాసరావ
విశాఖ వాంబే కాలనీలో తెదేపా నేతలు ఆందోళన చేశారు. మైనర్ పై అత్యాచారయత్నానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న తెదేపా నేతలు