విశాఖ గ్రామీణ జిల్లాలో ఇళ్ల స్థలాలు కేటాయింపులో అధికార పార్టీ దందా ఎక్కువైందని శాసనమండలి సభ్యులు బుద్దా నాగజగదేశ్వరరావు తెలిపారు. బుచ్చెయ్యపేట మండలంలో బాధితులతో కలిసి ఆయన అందోళన చేపట్టారు. బుచ్చెయ్యపేట, అయితంపూడి, నీలకంఠపురంలో జరుగుతున్న అన్యాయాలు, ఓంటెద్దు పోకడలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శశ్మాన వాటికలో ఇళ్లస్థలాలు ఇవ్వడమేమిటంటూ ఎమ్మెల్సీ నాగజగదేశ్వరరావు ప్రశ్నించారు. ప్రజలు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు బత్తుల తాతయ్య బాబు, గోకివాడ కోటశ్వరరావు, వియ్యపు అప్పారావు, గ్రామస్థులు పాల్గొన్నారు.
'ఇళ్ల స్థలాలు కేటాయింపుల్లో అధికార పార్టీ దందా ఎక్కువైంది' - tdp leaders protest at visakhapatnam news
విశాఖ గ్రామీణ జిల్లా బుచ్చెయ్యపేట మండలంలో తెదేపా హయాంలో ఇళ్ల లబ్ధిదారులతో కలిసి శాసనమండలి సభ్యులు బుద్దా నాగజగదేశ్వరరావు అందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు బత్తుల తాతయ్య బాబు, గోకివాడ కోటశ్వరరావు, వియ్యపు అప్పారావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇళ్ల స్థలాల కేటాయింపులపై తెదేపా నేతల ఆందోళన