విశాఖలో ఆస్తి విలువ ఆధారిత పన్నును రద్దు చేయాలని కోరుతూ.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి బండారు సత్యనారాయణ, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తేదేపా నేతలు పాల్గొన్నారు. తక్షణమే ఆస్తి పన్ను పెంపును, చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రజా పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. కరోనాతో రెండేళ్ల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. కనీసం కౌన్సిల్లో చర్చ జరపకుండా ఆస్తి పన్ను పెంచే దుర్మార్గపు ఆలోచన చేయడం దారుణమన్నారు.
ఆస్తి విలువ ఆధారిత పన్ను రద్దు చేయాలని తెదేపా నేతల నిరసన - protest in vizag
విశాఖలో తెదేపా నేతలు ఆందోళన చేశారు. ఆస్తి విలువ ఆధారిత పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం చేయకుండా... ఇలాంటి ఆలోచనలు చేయడం దుర్మార్గమమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్తి విలువ ఆధారిత పన్ను రద్దు కోరుతూ తెదేపా నేతల నిరసన